ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న కమిషనర్ చల్లా ఓబులేసు
నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): ప్రజల ఫిర్యా దుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని నగర పాలక సంస్థ కమిష నర్ చల్లా ఓబులేసు అన్నారు. స్థానిక ఎస్‌బీఐ కాలనీలోని నగర పాలక సమావేశ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుంచి 18 అర్జీలు ఆయన స్వీక రించారు. కమిషనర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్య ప్రాంతాన్ని సందర్శిం చినప్పుడు సమస్యను పూర్తిగా గ్రహించి, పరిష్కా రం కనుగొనడం సులభమవుతుందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ఆర్‌జీవీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఈ జే.ర మణమూర్తి, ప్రజారోగ్య అధికారి డా.ఎం.రఘు, డీసీపీ షబ్నమ్ శాసి్త్ర, ఏసీపీ నాగరాజు, మేనేజర్ జునైద్, కార్యదర్శి నాగరాజు, వాజిద్, సర్వేయర్ మద్దిలేటి, టిడ్కో అధికారి పెంచలయ్య పాల్గొన్నారు.
Updated Date - Sep 08 , 2026 | 12:24 AM
Tags
(0)Comments