తన గత రికార్డునే బ్రేక్ చేయబోతున్న చరణ్?

తన గత రికార్డునే బ్రేక్ చేయబోతున్న చరణ్?
View on original source
Category: Entertainment
Share
Archive
Like
By: Sravani Lakshmi Srungarapu | 8 Sept 2026 10:00 PM IST ఒక స్టార్ హీరో సినిమా నుంచి సినిమాకు మారడం సహజమే. కానీ సుకుమార్ సినిమాల్లో హీరో మార్పు కేవలం కథకు సంబంధించినది మాత్రమే కాదు.. ఆడియ‌న్స్ స్క్రీన్ పై చూసే ఆ హీరో రూపాన్నే కొత్తగా పరిచయం చేసే ప్రయత్నంలా ఉంటుంది. ఇప్పుడు రామ్ చరణ్‌తో చేయబోతున్న RC17 విషయంలోనూ అదే డిస్క‌ష‌న్ ఆసక్తికరంగా మారుతోంది. సుకుమార్ కథల్లో హీరో క్యారెక్ట‌ర్‌కు ఓ ప్ర‌త్యేక ప్ర‌పంచం ఉంటుంది. ఆ ప్రపంచానికి తగ్గట్టుగానే హీరో నడక, మాటతీరు, బాడీ లాంగ్వేజ్ రూపుదిద్దుకుంటాయి. అందుకే సుకుమార్ సినిమాల్లో ఎంతటి స్టార్ హీరో క‌నిపించినా, ఆడియ‌న్స్ కు హీరో కంటే ముందు సినిమాలోని పాత్రే క‌నిపిస్తుంద‌నే అభిప్రాయ‌ముంది. ఇప్పుడు రామ్ చరణ్ విషయంలోనూ సుకుమార్ అదే ప్రయోగానికి సిద్ధమవుతున్నార‌నే విష‌యం ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే తన గత సినిమా పెద్ది కోసం రామ్ చరణ్ పూర్తిగా భిన్నమైన మేకోవ‌ర్ చేసిన సంగ‌తి తెలిసిందే. క్యారెక్ట‌ర్ కోసం శరీరాకృతిలో మార్పులు చేసుకోవడం, స్క్రీన్‌పై కొత్త ఎనర్జీతో కనిపించడం చరణ్‌కు కొత్త విషయం కాదు. అయితే ఈసారి అసలు ఛాలెంజ్ మరింత ఆసక్తికరంగా ఉంది. గతంలో కనిపించిన మేకోవ‌ర్ ను మళ్లీ రిపీట్ చేయ‌కుండా, ఆడియ‌న్స్ ఊహించ‌ని మరో కొత్త చరణ్‌ను చూపించాల్సి ఉంది. ఇక్కడే రామ్ చరణ్‌కు అసలు పోటీ మరో హీరోతో కాదనే విషయం స్పష్టమవుతోంది. గత సినిమాల్లోని పాత్రల్లో స్వ‌యంగా తాను సెట్ చేసిన ప్రమాణాలను తానే అధిగమించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక సినిమాలో చేసిన ట్రాన్స్‌ఫర్మేషన్ తర్వాత, త‌ర్వాతి సినిమాలో కూడా అదే తరహా లుక్‌తో కనిపిస్తే కొత్తదనం తగ్గిపోతుంది. అందుకే ప్రతి కొత్త పాత్రతో తనను తాను మళ్లీ ఆవిష్కరించుకోవడం స్టార్ హీరోలకు ఇప్పుడు పెద్ద ఛాలెంజ్‌గా మారుతోంది. RC17 కోసం చరణ్‌లో కనిపించబోయే మార్పులపై ఇప్పటికే ఇంట్రెస్టింగ్ డిస్క‌ష‌న్ జరుగుతోంది. లీన్ ఫిజిక్‌తో పాటు పొడవాటి జుట్టుతో ఆయన కనిపించే అవకాశం ఉందన్న ప్రచారం, ఈ పాత్రపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. అయితే ఈ మార్పులు కేవలం లుక్ కోసమేనా? లేక సుకుమార్ రాసుకున్న క్యారెక్ట‌ర్ ను స్క్రీన్‌పై మ‌రింత స్ట్రాంగ్ గా చూపించడానికి రూపొందిస్తున్నారా? అనే ప్ర‌శ్న‌కు మాత్రం స‌మాధానం రావాల్సి ఉంది. సుకుమార్ సినిమాల్లో హీరో లుక్ అనేది కాస్ట్యూమ్ ఛేంజ్ తో మార‌దు. క్యారెక్ట‌ర్ లోని ఎమోష‌న్ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు ప్రతిదీ ఒకే ప్రపంచంలో భాగంగా కనిపిస్తుంది. అందుకే RC17లో రామ్ చరణ్ ఎలా కనిపిస్తారన్న దానికంటే, సుకుమార్ ఆయనను ఎలాంటి పాత్ర‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారన్నదే ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలోనే చ‌ర‌ణ్ మ‌ళ్లీ తనను తాను కొత్తగా కనిపించేలా చేయాల్సిన ఛాలెంజ్ మాత్రం ఆయన ముందుంది. Tags:

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.