Local Elections : స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక ఆదేశాలు

Local Elections : స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక ఆదేశాలు
View on original source
Category: Politics
Share
Archive
Like
Local Elections : ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ (Local Elections) శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డపేరు రాకుండా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చేపట్టాలని సూచించారు. గెలుపే ప్రధాన లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. Read Also : 35 ఏళ్ల తర్వాత భారత్‌కు 'A' రేటింగ్..! ఆదరణ, పార్టీ కోసం చేసిన పని, సామాజిక : స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో ప్రజల్లో ఆదరణ, పార్టీ కోసం చేసిన పని, సామాజిక సమీకరణాలు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు ఇప్పటికే సూచించారు. యువత, మహిళలకు కూడా అవకాశాలు కల్పించేలా ఎంపిక ప్రక్రియ ఉండాలని పార్టీ నేతలకు చెప్పారు. సీనియర్లు, కొత్తతరం నాయకులు కలిసి పనిచేయడం ద్వారా పార్టీకి మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు. అదే సమయంలో వ్యక్తిగత విభేదాలు, రాగద్వేషాలను పక్కన పెట్టి క్షేత్రస్థాయిలో నాయకులంతా ఐక్యంగా పనిచేయాలని చంద్రబాబు ఆదేశించారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం, పార్టీకి నష్టం కలిగించే ప్రయత్నాలు చేయడం వంటి చర్యలను సహించబోమని, అవసరమైతే సస్పెన్షన్ వంటి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు కూడా కీలక అంశంగా మారాయి. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని**, ఒక్క శాతం కూడా తగ్గించబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. అవసరమైతే 34 శాతానికి మించి ప్రాతినిధ్యం కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. రిజర్వేషన్లపై కొందరు కోర్టులను ఆశ్రయించడాన్ని ఆయన విమర్శించారు. ఇక రాష్ట్రంలో అక్టోబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాల నేపథ్యంలో టీడీపీ కూటమి పార్టీలు క్షేత్రస్థాయిలో సమన్వయంపై దృష్టి పెడుతున్నాయి. అయితే కూటమి భాగస్వాముల మధ్య స్థానిక పదవుల విషయంలో పోటీ, సీట్ల సర్దుబాటు కూడా సవాలుగా మారే అవకాశం ఉంది. మొత్తంగా, స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అభ్యర్థుల ఎంపిక నుంచి కూటమి సమన్వయం వరకు ప్రతి అంశాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. Read Also hindi news: hindi.vaartha.com Read Also Epaper : epaper.vaartha.com Read Also : రచయిత గురించి Ramesh Previous EPF Withdraw : ఈపీఎఫ్ విత్‌డ్రా.. కొత్త రూల్స్.. ఎవరెంత తీసుకోవచ్చంటే..?గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. మరిన్ని వార్తలు Chinna Srinu: కుమార్తెతో కలిసి టీడీపీలో చేరిన బొత్స మేనల్లుడు చిన్న శ్రీను YouTuber Nandana: పోలీసుల విచారణలో యూట్యూబర్ నందన..నాకేం తెలియదు, అంతా భర్తే చూసుకున్నాడంటూ వాదన Onion : ఏపీలో కిలో ఉల్లి రూ.32..సామాన్యులకు భారీ ఊరట కల్పించిన సర్కార్ School Holidays: తెలుగు రాష్ట్రాల్లో వరుసగా మూడు రోజుల హాలిడేస్ YCP : వైసీపీకి బిగ్ షాక్..కీలక నేత రాజీనామా Chandrababu Naidu: కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం.. స్థానిక ఎన్నికల్లో గెలవాలి ప్రకటన అత్యధికంగా చదివారు ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, అర్హులైన పేదలకు కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు... భారతీయ బులియన్ మార్కెట్లో మంగళవారం ఉదయం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్... హైదరాబాద్ మహానగరం రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. భాగ్యనగరం కొన్ని చోట్ల ఔటర్ రింగ్ దాటి పోయింది.... మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'కాకా'.... కాలం మారుతున్న కొద్దీ మనుషుల మధ్య బంధాలు, భావోద్వేగాలు కూడా మారిపోతున్నాయా అనిపించే ఘటన ఇది.... కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం... కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం... బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ వర్కింగ్... భారత క్రికెట్ జట్టు తొలిసారిగా జపాన్‌తో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో తలపడేందుకు సిద్ధమవుతోంది. రెండు దేశాల... అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా ప్రాంతమంతటా బూడిద వ్యాపించి, అనేక విమానాశ్రయాలు రెండు రోజుల పాటు మూసివేయబడటంతో,... ప్రకటన తాజా వార్తలు మీకు నచ్చవచ్చు

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.