ఇంటర్నెట్ డెస్క్: పారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద హిందూ సంస్థ బీఏపీఎస్ (BAPS) ప్రతినిధుల పర్యటన సందర్భంగా తలెత్తిన వివాదంపై భారత్ స్పందించింది. ఈ వ్యవహారం సంబంధిత సంస్థల మధ్య విషయమని, దీనిపై భారత ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయబోదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది (Eiffel Tower BAPS row).
విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మంగళవారం మీడియా సమావేశంలో ఈఫిల్ టవర్ వివాదంపై స్పందించారు. పారిస్ ప్రాంతంలో బీఏపీఎస్ ఆలయ ప్రారంభం గురించి తమకు తెలుసని, అయితే ఈఫిల్ టవర్‌కు సంబంధించిన వివాదం మాత్రం సంబంధిత వర్గాల మధ్య అంశమని తెలిపారు. ఆ వివాదం గురించి భారత ప్రభుత్వం ఎలాంటి వ్యాఖ్యలూ చేయబోదని స్పష్టం చేశారు (BAPS delegation Paris).
పారిస్‌లో కొత్తగా నిర్మించిన బీఏపీఎస్ హిందూ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఆ సంస్థకు చెందిన సుమారు 100 మంది ప్రతినిధులు శనివారం ఈఫిల్ టవర్‌ను సందర్శించారు. ఈ పర్యటన సమయంలో మహిళా ఉద్యోగులను తమ పని ప్రదేశాల నుంచి తప్పించి, కొన్ని ప్రాంతాలకు వెళ్లకుండా ఆదేశించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై పారిస్ మేయర్ ఎమ్మాన్యుయెల్ గ్రెగ్వార్ దర్యాప్తు ప్రారంభిస్తామని ప్రకటించారు (Women staff Eiffel Tower).
వివాదం నేపథ్యంలో బీఏపీఎస్ క్షమాపణలు తెలిపింది (Paris Hindu temple). ఈఫిల్ టవర్ సందర్శనను అక్కడి యాజమాన్యంతో సమన్వయం చేసుకున్నామని, పెద్ద సంఖ్యలో ప్రతినిధులు రావడంతో ఇతర సందర్శకులకు ఇబ్బంది కలగకుండా సమయాన్ని ముందుగా నిర్ణయించుకున్నామని తెలిపింది. అయితే మహిళలపై లింగ వివక్ష చూపుతూ పక్కకు తప్పించాలనే ఉద్దేశం తమకు లేదని బీఏపీఎస్ స్పష్టం చేసింది. ఎవరినీ ఈఫిల్ టవర్‌లోకి రాకుండా అడ్డుకోలేదని పేర్కొంది. అలాగే ఈ ఘటన వల్ల ఎవరైనా బాధపడితే క్షమించాలని కోరింది.
సౌదీ అరేబియాపై హౌతీల భారీ దాడులు.. 73 మందికి గాయాలు..
హిందీ జాతీయ భాష.. శివ రాజ్‌కుమార్ వ్యాఖ్యపై సోషల్ మీడియాలో దుమారం..
Updated Date - Sep 08 , 2026 | 09:59 PM
(0)Comments