‘ఆమె' జోలికొస్తే ఖబడ్దార్.. అసెంబ్లీ వేదికగా తమిళనాడు సీఎం మాస్ వార్నింగ్.!

‘ఆమె' జోలికొస్తే ఖబడ్దార్.. అసెంబ్లీ వేదికగా తమిళనాడు సీఎం మాస్ వార్నింగ్.!
View on original source
Category: Politics
Share
Archive
Like
తమిళనాడు రాజకీయాల్లో మహిళలపై జరుగుతున్న అసభ్య, ద్వంద్వార్థ వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ సీరియస్ గా స్పందించారు. అసెంబ్లీ వేదికగా 'ఆమె'పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీలో పోలీసు శాఖ బడ్జెట్ డిమాండ్లపై చర్చ సందర్భంగా మాట్లాడిన విజయ్.. మహిళలను కించపరిచేలా మాట్లాడే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజకీయ విమర్శలు ఎంత తీవ్రంగానైనా ఉండవచ్చని.. కానీ భావప్రకటన స్వేచ్ఛ పేరుతో మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత దూషణలకు దిగడం క్షమించరాని నేరమన్నారు. ఇటీవల కాలంలో కొందరు రాజకీయ నాయకులు ఉద్దేశపూర్వకంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని డబుల్ మీనింగ్ డైలాగులు, అసభ్య పదజాలం వాడటం ప్రజలు అంతా గమనిస్తున్నారన్న విజయ్.. అటువంటి వారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. కాగా అసెంబ్లీ వేదికగా విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇందుకు కారణం డిఎంకె అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ గత నెలలో జరిగిన కావేరి నిరసనల సమయంలో నటి, త్రిషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే కారణమని పరిశీలకలు అంటున్నారు. త్రిషపై ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలపై గత 4న చెన్నైలోని ఆయన నివాసంలో ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, తంజావూరుకు తరలించి విచారించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన స్టేషన్ బెైల్‌పై విడుదలయ్యారనుకోండి అది వేరే సంగతి. ఈ నేపథ్యంలోనే సీఎం విజయ్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలపై నేరుగా అసెంబ్లీలో ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు. రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేసేటప్పుడు సంయమనం పాటించాలని, రాజకీయ హద్దులు దాటి మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేసేలా మాట్లాడే ధోరణి ఇకపై చెల్లదని ఆయన అసెంబ్లీ సాక్షిగా వార్నింగ్ ఇచ్చారు. [CM Vijay Mass Warning On Untoward Comments women, Trisha remarks row, Udhayanidhi Stalin, Tamil Nadu Assembly, Vijay on women safety, double meaning comments]

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.