Latest news
ఆకాశమే హద్దంటున్న మనోజ్‌కుమార్
మనోజ్‌కుమార్
న్యూస్‌టుడే, హుస్నాబాద్ గ్రామీణం: పైలెట్ కావాలనే ఆ యువకుడి కలలకు తల్లిదండ్రులు రెక్కలు తొడిగారు. అన్ని విధాలుగా అండగా నిలిచి ప్రోత్సహించారు. ఫలితంగా ఆ రెక్కలనే ఆసరా చేసుకున్న యువకుడు ఆకాశమే హద్దుగా ఎగిరారు. వారి కష్టం, శ్రమకు అతని నిరంతర కృషి, పట్టుదల తోడు కావడంతో అనుకున్నది సాధించారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో పైలెట్‌గా ఎంపికై అందరిచేత ఔరా అనిపిస్తున్నారు. హుస్నాబాద్ మండలం బల్లునాయక్‌తండాకు చెందిన లావుడ్య బిక్షపతి, గాయత్రి దంపతుల కుమారుడు మనోజ్‌కుమార్. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఇంటర్ తర్వాత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో చేరి 6 నెలల పాటు కమర్షియల్ పైలెట్ శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత పైలెట్ శిక్షణకు సంబంధించిన ఆరు పరీక్షలు రాసి అర్హత సాధించారు. మహారాష్ట్రలోని బారామతిలో అంతర్జాతీయ విమానాలు నడిపేందుకు సంబంధించిన కోర్సులో ఏడాదిన్నర కాలం శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు.
మూడు నెలల శిక్షణ అనంతరం..: ఇండిగో ఎయిర్‌లైన్స్ వారు దిల్లీలో ఈ నెల 3న నిర్వహించిన ఇంటర్వ్యూకు హాజరై అందులోనూ ప్రతిభ కనబరిచి పైలెట్‌గా ఎంపికయ్యారు. సంస్థ వారు సుమారు 3 నెలలు శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత పైలెట్‌గా విధుల్లో చేరనున్నట్లు మనోజ్ తండ్రి బిక్షపతి తెలిపారు. ఇందుకోసం రూ.30 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నానన్నారు. తాను పైలెట్ కావడమే కాదు. తనలాగే పైలెట్ కావాలనుకున్న యువతకు శిక్షణ ఇచ్చేందుకు స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు శిక్షణ సంస్థ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తన స్నేహితులు నిర్వహిస్తున్నారని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ
దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు /
సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
జిల్లా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
Useful Topics
(0)Comments