వాయు కాలుష్యంపై కేంద్రం సర్వే.. లక్నో టాప్, హైదరాబాద్‌ 19, విశాఖ 21

వాయు కాలుష్యంపై కేంద్రం సర్వే.. లక్నో టాప్, హైదరాబాద్‌ 19, విశాఖ 21
View on original source
Category: Tourism
Share
Archive
Like
దేశవ్యాప్తంగా తీవ్ర వాయు కాలుష్యంతో సతమతమవుతున్న ఢిల్లీ, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 'స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2026' ర్యాంకుల్లో ఆసక్తికరమైన ఫలితాన్ని సాధించింది. 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల కేటగిరీలో ఢిల్లీ 21వ స్థానంలో నిలిచింది. తీవ్ర శీతాకాలపు పొగమంచు, విషపూరిత గాలి ఉన్నప్పటికీ.. బెంగళూరు (32వ ర్యాంక్), శ్రీనగర్ (26వ ర్యాంక్) వంటి నగరాలను ఢిల్లీ వెనక్కి నెట్టడం గమనార్హం. అయితే, ఈ ర్యాంకులు నగరాల్లోని గాలి నాణ్యతకు ప్రతిబింబం కాదు. కాలుష్య నియంత్రణకు నగరాలు తీసుకుంటున్న చర్యల ఆధారంగానే ఈ సర్వేను నిర్వహించారు. ఈ కేటగిరీలో 198 పాయింట్లతో లక్నో అగ్రస్థానంలో నిలవగా, ఇండోర్ రెండో స్థానంలో, జబల్‌పూర్ (195 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచాయి. ఢిల్లీ 172 పాయింట్లతో విశాఖపట్నంతో కలిసి 21వ స్థానాన్ని పంచుకుంది. గతేడాది 32వ స్థానంతో పోలిస్తే ఢిల్లీ తన ర్యాంకును మెరుగుపరుచుకోవడం విశేషం. ఇతర ప్రధాన నగరాలైన హైదరాబాద్ 19వ స్థానంలో, పాట్నా 16, ముంబై 28, చెన్నై 35, కోల్‌కతా 38వ స్థానాల్లో నిలిచాయి. ర్యాంకుల వెనుక అసలు కథ జాతీయ స్వచ్ఛమైన గాలి కార్యక్రమం (NCAP) కింద కేంద్రం ఈ సర్వేను నిర్వహిస్తోంది. కేవలం గాలి నాణ్యత స్థాయులను కాకుండా, కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ఈ సర్వే మదింపు చేస్తుంది. రోడ్ల పై దుమ్ము నిర్వహణ, ఘన వ్యర్థాల తొలగింపు, వాహన, పారిశ్రామిక ఉద్గారాల తగ్గింపు, నిర్మాణ వ్యర్థాల నిర్వహణ, ప్రజల్లో అవగాహన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అందువల్ల, గాలి నాణ్యత తక్కువగా ఉన్న నగరం సైతం.. నియంత్రణ చర్యలను బలంగా అమలు చేస్తే మెరుగైన ర్యాంకు సాధించే అవకాశం ఉంటుంది. ఢిల్లీ విషయంలో ఇదే జరిగింది. ఢిల్లీలో వాస్తవ పరిస్థితి ర్యాంకు మెరుగైనప్పటికీ, ఢిల్లీలో కాలుష్య స్థాయిలు ప్రమాదకరంగానే ఉన్నాయి. 2025లో పీఎం10 కణాలు జాతీయ సగటు (60 µg/m³) కంటే చాలా ఎక్కువగా 198 µg/m³గా నమోదయ్యాయి. అలాగే పీఎం2.5 కణాలు కూడా నిర్దేశిత పరిమితి (40 µg/m³) కంటే రెట్టింపునకు పైగా 97 µg/m³గా రికార్డయ్యాయి. 2026 జనవరిలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్ IV ఆంక్షలను కూడా విధించారు. మొత్తం 130 నగరాల్లో ఈ సర్వే నిర్వహించగా, 3-10 లక్షల జనాభా కేటగిరీలో రవుర్కెలా, 3 లక్షల లోపు జనాభా కేటగిరీలో కళింగ నగర్ ప్రథమ స్థానాల్లో నిలిచాయి.

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.