Green Tea : బరువు తగ్గాలని బలంగా ట్రై చేస్తున్నారా? గ్రీన్ టీలో ఈ రెండు కలిపి చూడండి..!

Green Tea : బరువు తగ్గాలని బలంగా ట్రై చేస్తున్నారా? గ్రీన్ టీలో ఈ రెండు కలిపి చూడండి..!
View on original source
Category: Health
Share
Archive
Like
Green Tea For Weight Loss బరువు తగ్గడానికి గ్రీన్ టీ తాగడం ఇప్పటికే ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే దీని ప్రయోజనాలను రెట్టింపు చేయడానికి నిపుణులు ఒక ప్రత్యేకమైన కాంబినేషన్‌ను సూచిస్తున్నారు. ఈ మూడింటి కలయిక శరీరంలోని మొండి కొవ్వును కరిగించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, వేగంగా బరువు తగ్గడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఆ కాంబినేషన్‌ ఏంటంటే గ్రీన్ టీ + నెయ్యి + దాల్చినచెక్కల కలయిక. ఈ కాంబినేషన్ ఎందుకు అంత ప్రత్యేకమైనది? గ్రీన్ టీ, ఆవు నెయ్యి, దాల్చినచెక్క మూడూ తమదైన శైలిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ ఇవి మూడూ కలిసి పనిచేసినప్పుడు బరువు తగ్గించే సామర్థ్యం రెట్టింపు అవుతుంది. గ్రీన్ టీలోని కాటెచిన్లు, కెఫిన్ దాల్చినచెక్కలోని థర్మోజెనిక్ గుణాలు శరీర జీవక్రియలను వేగవంతం చేస్తాయి. దీనివల్ల విశ్రాంతి సమయంలో కూడా శరీరం ఎక్కువ క్యాలరీలను కరిగిస్తుంది. దాల్చినచెక్క రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా చూస్తుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వ కాకుండా, శక్తిగా మారేలా ప్రోత్సహిస్తుంది. తీపి పదార్థాలు తినాలనే కోరికను కూడా ఇది తగ్గిస్తుంది. ఇవి కూడా చదవండి ఓరీ దేవుడో..మనం తింటున్న జీడిపప్పు నకిలీదా? కల్తీని కనిపెట్టాలంటే మాదాపూర్‌లో మహా మత్తు దందా..వాట్సాప్ ఆర్డర్లు..ర్యాపిడో డెలివరీలు రోజువారీ కాఫీతో కాలేయానికి ఆరోగ్యం! నిపుణులు ఏం చెబుతున్నారంటే.. వేడి నీళ్ల కోసం గీజర్ వాడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే గ్రీన్ టీలో కొద్దిగా నెయ్యి కలపడం వల్ల అందులోని ఒమేగా-3, ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్లు శరీరానికి లభిస్తాయి. ఇవి కడుపు నిండిన అనుభూతిని ఇస్తాయి. ఫలితంగా అకస్మాత్తుగా ఆకలి వేయడం, మధ్యమధ్యలో జంక్ ఫుడ్స్ తినడం తగ్గుతుంది. నెయ్యి జీర్ణవ్యవస్థను సున్నితంగా మార్చి ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గ్రీన్ టీ మరియు దాల్చినచెక్కలతో కలిపి తీసుకున్నప్పుడు జీర్ణ సమస్యలు తగ్గడమే కాకుండా పోషకాల శోషణ వేగవంతమవుతుంది. ఎలా తయారు చేసుకోవాలి?: ఒక కప్పు వేడి గ్రీన్ టీని సిద్ధం చేసుకుని, అందులో అర టీస్పూన్ స్వచ్ఛమైన ఆవు నెయ్యి, చిటికెడు దాల్చినచెక్క పొడి వేసి బాగా కలపాలి. దీనిని ఉదయాన్నే పరగడుపున లేదా సాయంత్రం స్నాక్ సమయానికి ప్రత్యామ్నాయంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ సహజమైన పానీయాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ, దానికి తగినట్లుగా సరైన పోషకాహారం, రోజువారీ వ్యాయామం జోడిస్తే బరువు సులభంగా అదుపులోకి వస్తుంది.

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.