Manyam Police రాష్ట్ర క్రీడా పోటీల్లో మన్యం పోలీసుల ప్రతిభ

Manyam Police రాష్ట్ర క్రీడా పోటీల్లో మన్యం పోలీసుల ప్రతిభ
View on original source
Category: Politics
Share
Archive
Like
పతకాలు సాధించిన పోలీస్‌ సిబ్బందితో ఎస్పీ మాధవరెడ్డి బెలగాం, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): మంగళగిరిలో జరిగిన 1వ ఏపీ స్టేట్‌ పోలీస్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌-2026లో జిల్లా పోలీసులు సత్తాచాటారు. 31 పతకాలు సాధించారు. ఇందులో 14 స్వర్ణ, 9 రజిత, 8 కాంస్య పతకాలు ఉన్నాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 9 మంది పోలీస్‌ సిబ్బందిని సోమవారం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ మాధవరెడ్డి సత్కరించి అభినందించారు. విధుల్లో ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయ న్నారు. సిబ్బంది క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. రాష్ట్రస్థాయి జాగిలాల పోటీల్లో ట్రాకింగ్‌ జాగిలం శాండీ ట్రోఫీతో పాటు కాంస్య పతకం సాధించడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొని సత్తాచాటాలని ఆకాంక్షించారు. ఈ కార్య క్రమంలో ఏఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, ఏఆర్‌ డీఎస్పీ థామస్‌రెడ్డి, ఎస్‌బీ సీఐ రమణమూర్తి, ఆర్‌ఐలు నాయుడు, రాంబాబు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. Updated Date - Sep 08 , 2026 | 12:34 AM Tags

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.