సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
పార్వతీపురం, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ, భూ సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. గ్రామస్థాయిలోనే వాటిని పరిష్కరించాలనిన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా 22ఏ భూములు, రీసర్వే, మ్యుటేషన్లు, రెవెన్యూ క్లినిక్స్, మన మిత్ర సేవల పురోగతిపై సమీక్షించారు. ప్రతి గురువారం గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ నిర్వహించాలన్నారు. రైతులకు వీఆర్‌వోలు ఫోన్ చేసి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. వారి వద్దకే వెళ్లి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. వీఆర్‌వో పరిధిలో పరిష్కరించాల్సిన సమస్యలపై ప్రజలు కలెక్టరేట్‌కు వస్తే బాఽధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 22ఏ జాబితా పరిశీలన, భూసర్వే, పెండింగ్ మ్యుటేషన్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి, సీతంపేట ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్‌వో హేమలత, తహసీల్దార్లు పాల్గొన్నారు.
Updated Date - Sep 08 , 2026 | 12:32 AM
Tags
(0)Comments