September 8, 2026 / 10:09 PM IST
Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె (Deepika Padukone) రెండోసారి తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. కొన్నిరోజుల క్రితం బేబీ బంప్‌తో కనిపించిన దీపిక.. మెటర్నిటీ ఫొటోలను పంచుకుంది. నటుడు, భర్త రణ్‌వీర్ సింగ్, తమ గారాలపట్టి దువాతో కలిసి.. తాము రెండో బిడ్డను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నామని ఫొటోలు షేర్ చేసిందీ బ్యూటీ.
బాలీవుడ్ జంట దీపికా పదుకొని, రణ్‌వీర్ సింగ్‌లు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. రెండేళ్ల క్రితం దువాకు జన్మనిచ్చిన దీపిక.. త్వరలోనే పండంటి బిడ్డను తమ కుటుంబంలోకి ఆహ్వానించనుంది. గర్భం దాల్చిన కారణంగా సినిమాలకు బ్రేకిచ్చిన తను మంగళవారం మెటర్నిటీ ఫొటోలు పంచుకుంది. భర్త రణ్‌వీర్, కూతురు దువాలతో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తమ కుటుంబం పెద్దది కాబోతున్న సంతోషంలో దీప్‌వీర్ సంతోషంగా కనిపించారు. త్వరలోనే అక్క కాబోతున్న చిన్నారి దువా ఈ ఫొటోల్లో చాలా క్యూట్‌గా ఉంది.
#RanveerSingh and #DeepikaPadukone share heartwarming maternity photos with daughter Dua as they prepare to welcome their second child. pic.twitter.com/x7ZM6t9ymp
— greatandhra (@greatandhranews) September 8, 2026
GOALS! 😍#RanveerSingh and #DeepikaPadukone share the cutest bunch of pictures with daughter dua. ❤️#Celebs pic.twitter.com/xxcwzCaD5z
— Filmfare (@filmfare) September 8, 2026 Follow Us :
(0)Comments