మంచు కొండలు కరగకుండా గొర్రె ఉన్ని కవచం.. స్విస్ శాస్త్రవేత్తల వినూత్న ప్రయోగం

మంచు కొండలు కరగకుండా గొర్రె ఉన్ని కవచం.. స్విస్ శాస్త్రవేత్తల వినూత్న ప్రయోగం
View on original source
Category: SciTech
Share
Archive
Like
పర్యావరణ మార్పుల ప్రభావం వల్ల హిమనీనదాలు వేగంగా కరిగిపోతున్న నేపథ్యంలో, స్విట్జర్లాండ్‌లోని శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేకమైన ప్రయోగాన్ని చేపట్టారు. ఈ ప్రయోగం ద్వార పర్యావరణ మార్పుల ప్రభావం వల్ల హిమనీనదాలు వేగంగా కరిగిపోతున్న నేపథ్యంలో, స్విట్జర్లాండ్‌లోని శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేకమైన ప్రయోగాన్ని చేపట్టారు. ఈ ప్రయోగం ద్వారా, వారు హిమనీనదాలను కాపాడటానికి ప్లాస్టిక్ షీట్లకు ప్రత్యామ్నాయంగా గొర్రె ఉన్నితో తయారు చేసిన దుప్పట్లను ఉపయోగిస్తున్నారు. స్విట్జర్లాండ్‌లోని త్సాన్‌ఫ్ల్యూరాన్ గ్లేసియర్‌పై నిర్వహించిన ఈ ప్రయోగం ఆశాజనక ఫలితాలను అందించింది. లాసెన్ విశ్వవిద్యాలయం, స్విస్ గ్లేసియర్ మానిటరింగ్ నెట్‌వర్క్ (గ్లామోస్) సహకారంతో నలుగురు విద్యార్థులు తమ మాస్టర్స్ థీసిస్‌లో భాగంగా ఈ ఆలోచనను రూపకల్పన చేశారు. స్థానిక టెక్స్‌టైల్ సంస్థ ఫిసోలాన్ ఈ ప్రయోగానికి అవసరమైన ఉన్నిని అందించింది. జూన్ నెలలో 100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెండు భారీ ఉన్ని దుప్పట్లను అమర్చి, వాటి సమీపంలో సంప్రదాయ ప్లాస్టిక్ కవర్లను కూడా అమర్చారు. ఈ పరిశోధనలో, గొర్రె ఉన్ని ప్లాస్టిక్ షీట్ల మాదిరిగా సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది. ఈ ఉన్ని కవర్లు మంచు కరగడాన్ని సుమారు 50 నుంచి 70 శాతం వరకు నిరోధించగలిగాయి. సాధారణంగా, ప్లాస్టిక్ షీట్లు యూవీ కిరణాలు మరియు గాలి ప్రభావంతో కాలక్రమేణా విచ్ఛిన్నమై మైక్రోప్లాస్టిక్స్‌ను నీటిలో కలుపుతాయి. కానీ, ఉన్ని సహజమైనది కావడంతో, పర్యావరణంలో సులభంగా కలిసిపోతుంది. స్విట్జర్లాండ్‌లో సుమారు 40 నుంచి 70 శాతం గొర్రె ఉన్ని మార్కెట్ లేకుండా వ్యర్థంగా పారేస్తున్నారు. ఈ తాజా ప్రయోగం వ్యవసాయ వ్యర్థాలను సద్వినియోగం చేస్తూ, పర్యావరణ పరిరక్షణకు కొత్త మార్గాలను చూపిస్తోంది. అయితే, ఈ పద్ధతి కేవలం పరిమితమైన, అత్యంత విలువైన మంచు ప్రాంతాలకు మాత్రమే అనుకూలమని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని మొత్తం హిమనీనదాల్లో కేవలం 0.02 శాతం మేర మాత్రమే ఇలాంటి కవర్లతో రక్షణ కల్పిస్తున్నారు. ఇవి ఏర్పాటు చేయడం ఆర్థికంగా భారంతో కూడుకున్నది మాత్రమే కాదు, అధిక శ్రమతో కూడిన పని కూడా. భారీ స్థాయిలో హిమానీనదాలు కరిగిపోవడాన్ని ఇవి పూర్తిగా అడ్డుకోలేవని, శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించడమే వాతావరణ మార్పులకు అసలైన పరిష్కారమని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. 08 Sept, 2026 08 Sept, 2026

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.