Vaishnavi : విజయ్ దేవరకొండ గురించి వైష్ణవి ప్రస్తావన.. బావగారు అంటూ టీజ్ చేసిన ఆడియెన్స్.. బ్లష్ అయిన వైష్ణవి

Vaishnavi : విజయ్ దేవరకొండ గురించి వైష్ణవి ప్రస్తావన.. బావగారు అంటూ టీజ్ చేసిన ఆడియెన్స్.. బ్లష్  అయిన వైష్ణవి
View on original source
Category: Entertainment
Share
Archive
Like
Vaishnavi : విజయ్ దేవరకొండ గురించి వైష్ణవి ప్రస్తావన.. బావగారు అంటూ టీజ్ చేసిన ఆడియెన్స్.. బ్లష్ అయిన వైష్ణవి Published Date :September 8, 2026 , టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్లు ఎమోషనల్ అయ్యే సందర్భాలు చాలానే చూశాం. కానీ, ఒక సినిమా వేడుకలో ఏకంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముందే స్టేజ్‌పై భావోద్వేగానికి గురై, ఆయన మాటలే తనకు స్పూర్తి అంటూ కంటతడి పెట్టుకోవడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఆ హీరోయిన్ అలా ఎందుకు ఎమోషనల్ అయ్యారు? వారి మధ్య ఉన్న ఆ అనుబంధం వెనుక అసలు కథేంటి? అనేది చూద్దాం. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా, ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సొంత కష్టంతో పైకి వచ్చి స్టార్ డమ్ సంపాదించుకోవడం అంత ఆషామాషీ కాదు. సరిగ్గా ఇదే విషయాన్ని ఆ హీరోయిన్ ఓపెన్‌గా చెప్పుకొచ్చారు. 'లైఫ్‌లో మనల్ని నమ్మేవాళ్లు ఎవరూ లేకపోయినా, ఏమీ లేని రోజుల్లోనూ అంతే కాన్ఫిడెంట్‌గా, అంతే స్ట్రెంత్‌తో ఎలా నిలబడాలో నేను విజయ్ గారి జర్నీ చూసి నేర్చుకున్నాను' అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వాళ్లందరినీ ఆలోచోనలో పడేశాయి. ఎప్పుడైనా కెరీర్‌లో భయం వేసినప్పుడు, మీడియా ముందు మాట్లాడటానికి ఇబ్బందిగా అనిపించినప్పుడు తాను నేరుగా యూట్యూబ్‌లో విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూలు చూసి ధైర్యం తెచ్చుకుంటానని ఆమె చెప్పడం విశేషం. బయట నుంచి చూసేవాళ్లకు ఇదొక సాధారణ ఫ్యాన్ మూమెంట్లా అనిపించినా, కష్టకాలంలో ఒక వ్యక్తిని ఏ స్థాయిలో ఇన్‌స్పైర్ చేయవచ్చో ఈ ఘటన అద్దం పడుతోంది. Ranveer - Deepika: దువాతో రణవీర్ – దీపిక క్యూట్ ఫ్యామిలీ పిక్స్ వైరల్.. బేబీ బంప్‌తో దీపిక స్పెషల్ అట్రాక్షన్! Youtuber Nandu : స్టేషన్ గుమ్మం వరకు కారు, రమా నందనకు పోలీసుల రాచమర్యాదలు? Malavika Mohanan: డూప్ వద్దు.. నేనే దూకేస్తా.. 'సర్దార్ 2' సెట్స్‌లో మాళవిక సాహసం! Fauzi: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫుల్ స్పీడ్‌లో 'ఫౌజీ' పోస్ట్‌ప్రొడక్షన్‌ వర్క్! ఇండస్ట్రీలో చాలామంది తనను 'నీకు ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇక్కడిదాకా ఎలా వచ్చావు?' అని తరచూ అడుగుతుంటారని, కానీ ఆ మాటలో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. 'నా వెనుక నా తల్లిదండ్రుల అండదండలు ఎప్పుడూ ఉన్నాయి. ఏ రోజు కూడా నా కష్టాలను నన్ను ఒంటరిగా ఎదుర్కోనివ్వలేదు. అలాగే నా ప్రతి విజయానికి నా బ్రదర్స్, నా స్నేహితులు నన్ను నానావిధాలుగా ప్రొటెక్ట్ చేస్తూ వెన్నంటే నిలబడ్డారు. అందుకే ఈ స్థాయికి రాగలిగాను' అంటూ తన సక్సెస్ వెనుక ఉన్న అసలు మనుషులను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే మరోపక్క విజయ్ దేవరకొండ గురించి వైష్ణవి ప్రస్తావన తీసుకురాగానే బావగారు అంటూ టీజ్ చేసిన ఆడియెన్స్ ను చూసి ఆమె బ్లష్ అయింది. వైష్ణవి ఆనంద్ తో ప్రేమలో ఉందని, త్వరలో పెళ్లి కూడా పీటలు ఎక్కనున్నారని ప్రచారం జరుగుతున్న క్రమంలో ఈ మూమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ స్పీచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండటంతో, టాలీవుడ్ వర్గాల్లో ఈ ఆసక్తికరమైన చర్చ హాట్ టాపిక్‌గా మారింది. కష్టాలను ఎదురుకుని నిలబడే ప్రతి ఒక్కరికీ ఈ రియల్ లైఫ్ జర్నీ ఒక చక్కటి స్పూర్తిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు! వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.