నెల రోజుల్లో కార్యకలాపాలు..
పరిధిలోకి 5 మున్సిపాలిటీలు, 19 మండలాలు..
సరిహద్దులు ఖరారు
తాత్కాలికంగా కార్యాలయం నుంచే కార్యకలాపాలు
భీమవరం టౌన్, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): భీమవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(బుడా) ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. గత ఉత్త ర్వుల మేరకు దీనిని పునర్వ్య వస్థీకరించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. బుడా పరిధిని పునఃనిర్వచి స్తూ త్వరలోనే సరిహద్దులను ఖరారు చేయనున్నారు. భీమవరం కేంద్రంగా జిల్లా లోని పట్టణ, గ్రామీణ ప్రాం తాల సమగ్రాభివృద్ధికి బాటలు పడనున్నాయి. బుడాకు సొంత భవనం అందుబాటులోకి వచ్చే వరకు భీమవరం మున్సిపల్ కార్యాలయంలోనే తాత్కాలి కంగా కార్యకలాపాలు నిర్వహించనున్నారు. మున్సిపల్ ఆఫీసు పైభాగంలో ఖాళీగా ఉన్న టౌన్ ప్లానింగ్ ఫ్లోర్‌ను కేటాయించారు. బుడా ఇన్‌చార్జి డీపీటీవోగా నియమితులైన సుధాకర్.. మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రరెడ్డితో చర్చలు జరిపారు. నెల రోజుల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
బుడా పరిధిని ప్రభుత్వం మరింత విస్తృతం చేస్తోంది. భీమవరం, తణుకు, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలతోపాటు ఆకివీడు నగర పంచాయతీ బుడా పరిధిలోకి రానున్నాయి. వీటితోపాటు జిల్లాలోని 19 మండలాలకు చెందిన 282 గ్రామీణ ప్రాంతాలను విలీనం చేయనున్నారు. టౌన్ ప్లానింగ్ వ్యవహారాల కోసం ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న సిబ్బందిని తిరిగి బుడాకు రప్పించే యోచనలో అధికారులు ఉన్నారు. జిల్లాకు చెందిన ఫైళ్లను ప్రస్తుతం వీరే పరిశీలిస్తుండ టంతో, వారిని ఇక్కడికే బదిలీ చేయనున్నారు. మాస్టర్ ప్లాన్లు, లేఅవుట్లు, భవన నిర్మాణ అనుమతుల పరిశీలనకు వీరి సేవలను వినియోగించుకోను న్నారు. పని భారాన్ని బట్టి అవసరమైతే టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన మరికొందరిని డిప్యుటేషన్‌పై తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
Updated Date - Sep 08 , 2026 | 12:36 AM
(0)Comments