Thimmapuram - ఆర్టీసీ బస్సు–కారు ఢీ

Thimmapuram - ఆర్టీసీ బస్సు–కారు ఢీ
View on original source
Category: Business
Share
Archive
Like
ముద్దనూరు(తెలుగు ప్రభ): వైఎస్ఆర్ కడప జిల్లా ముద్దనూరు మండలంలోని తిమ్మాపురం గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి నుంచి కడపకు ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎర్రగుంట్ల నుంచి ముద్దనూరు వైపు వస్తుండగా తిమ్మాపురం చిత్రలేఖ దాబా సమీపంలో ఎదురుగా వచ్చిన కారును ఢీకొంది. ఈ ప్రమాదం ధాటికి బస్సు అదుపుతప్పి రహదారి పక్కనున్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఒక్కసారిగా జరిగిన ప్రమాదంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న కొందరికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. అయితే ప్రమాద తీవ్రత దృష్ట్యా ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.సమాచారం అందుకున్న సీఐ నగేష్‌బాబు పోలీసు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం కారణంగా రహదారిపై ఏర్పడిన ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. ప్రమాదంలో వాహనాలకు జరిగిన నష్టం, గాయపడిన వారి వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో కొద్దిసేపు స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.