సాక్షి,విశాఖ: ఏపీ డీఎస్సీ స్కామ్‌లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. విశాఖలో టీచర్ ఉద్యోగాలు పొందిన చిల్లా యోగేశ్వరరావు, మోహినీ దేవిలు సమర్పించిన స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఫేక్ అని తేలడంతో చర్చాంశనీయమైంది. ఈ వ్యవహారంపై ఏపీ ఖోఖో అసోసియేషన్ మాజీ సెక్రెటరీ మేకల సీతారామిరెడ్డి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్) అధికారులకు సంచలన లేఖ రాశారు.
ఈ ఫేక్ సర్టిఫికేట్ల బండారాన్ని సాక్షి టీవీ తొలుత బయటపెట్టగా, తాజాగా ఖోఖో అసోసియేషన్ అధికారిక లేఖతో విషయం మరింత స్పష్టమైంది. శాప్‌కు రాసిన లేఖలో'చిల్లా యోగేశ్వరరావు, మోహినీ దేవిలకు సర్టిఫికేట్లు మేం ఇవ్వలేదు.శాప్ నుండి వీళ్ల అభ్యర్థిత్వంపై ఎలాంటి సమాచారం మాకు అందలేదు. వీళ్లు ఇద్దరికి మేం ఎలాంటి మెరిట్ సర్టిఫికేట్లు ఇవ్వలేదు. మా టోర్నమెంట్ల జాబితాల్లో ఎక్కడా వీరి పేర్లు లేవు. శాప్‌కి మేం పూర్తి వివరాలు అందిస్తున్నాం. వీళ్లు పొందుపర్చిన సర్టిఫికేట్లు చెల్లవు.నకిలీ, ఫోర్జరీ సర్టిఫికేట్లపై విచారణ జరపాలి. ఆ సర్టిఫికేట్లపై చర్యలు తీసుకోవాలి. శాప్‌కి మేం పూర్తి సహకారాన్ని అందిస్తాం'అని ఏపీ ఖోఖో అసోసియేషన్ మాజీ సెక్రెటరీ మేకల సీతారామిరెడ్డి లేఖలో పేర్కొన్నారు.
(0)Comments