September 8, 2026 / 10:24 PM IST
Vivo T5 5G : ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో నుంచి టీ5 5జీ పేరుతో కొత్త ఫోన్ లాంఛ్ అయింది. వివో సంస్థ నుంచి వచ్చిన మొబైల్ ఫోన్లలో టీ సిరీస్ సక్సెస్ ఫుల్ మోడల్. ఈ సిరీస్‌లో వచ్చిన ఐదో ఫోన్ ఇది. అమోలెడ్ డిస్‌ప్లేతో వచ్చిన ఫోన్ ఇది. మూడేళ్లపాటు ఓఎస్ అప్‌డేట్స్, ఐదేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని కంపెనీ చెబుతోంది.
రాయల్ బ్రాంజ్, సిల్వర్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్స్ లభిస్తాయి. సెప్టెంబర్ 9, బుధవారం నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కు అందుబాటులో ఉంటుంది. ఆరంభ ఆఫర్ కింద వివిధ కార్డులపై డిస్కౌంట్లు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు వర్తిస్తాయి. ఈ ఫోన్‌లోకి కీలక ఫీచర్లివి.
6.83 అంగుళాల 1.5కే కర్వుడ్ అమోలెడ్ డిస్‌ప్లే, 144 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, హెచ్‌డీఆర్10+ సపోర్ట్, మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్, మీడియాటెక్ ఎన్‌పీయూ 850 ఏఐ ప్రాసెసింగ్ యూనిట్, ఆండ్రాయిడ్ 16 బేస్డ్ ఆరిజన్ ఓఎస్ 6, ఐపీ68, ఐపీ 69 రేటింగ్, 7050 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 199 గ్రాముల బరువు, 50ఎంపీ+8ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ మెయిన్ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ, 8జీబీ+256 జీబీ, 12జీబీ+256జీబీ వంటి ఫీచర్లున్నాయి. ధరలు వేరియెంట్‌ను బట్టి రూ.34,999 / రూ.39,999 /రూ.44,999 /రూ.49,999. Follow Us :
(0)Comments