ఏపీ పిల్లలకు ఢిల్లీలో ఈ తిప్పలు ఎందుకు?..విజయసాయి రెడ్డి ఫైర్!

ఏపీ పిల్లలకు ఢిల్లీలో ఈ తిప్పలు ఎందుకు?..విజయసాయి రెడ్డి ఫైర్!
View on original source
Category: Politics
Share
Archive
Like
Delhi Hostels: ఢిల్లీలో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల వసతి సమస్యపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి స్పందించారు. ఢిల్లీ యూనివర్సిటీ దగ్గరలో హాస్టల్ వసతులు సరిగ్గా లేకపోవడంతో ఏపీ నుంచి అక్కడికి వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ట్విటర్ వేదికగా తెలిపారు. ఈ క్రమంలో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా హాస్టళ్లను నిర్మించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీ యూనివర్సిటీలో లక్షలాది మంది విద్యార్థులు చదువుతుంటే.. వారికి అందుబాటులో ఉన్న హాస్టల్ గదులు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. దీంతో బయట నుంచి ఢిల్లీకి వెళ్లే విద్యార్థులు ప్రైవేట్ పీజీలు, రెంటెడ్ రూమ్స్ ని ఆశ్రయించాల్సి వస్తోందని చెప్పారు. భారీ అద్దెలతో పాటు కొన్ని ప్రాంతాల్లో సరిగ్గా భద్రత కూడా లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి ఏడాది పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఢిల్లీకి వెళ్తున్నారు. మంచి కాలేజీల్లో సీట్లు సంపాదించుకున్నా.. అక్కడ ఉండేందుకు సరైన వసతులు లేకపోవడం మరో పెద్ద సమస్యగా మారుతుంది. చదువు కోసం సొంత ఊరిని, కుటుంబాన్ని వదిలి వెళ్లే విద్యార్థులకు తక్కువ ఖర్చుతో కూడిన వసతి అందుబాటులో ఉండటం చాలా అవసరమని విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో ఉన్న శ్రీ వెంకటేశ్వర కాలేజీ పరిస్థితిని కూడా ఆయన ఈ సందర్భంగా లేవనెత్తారు.వేలాది మంది విద్యార్థులు చదువుతున్న ఈ కాలేజీలో హాస్టల్ చాలా చిన్నగా ఉందని తెలిపారు. దీంతో మిగిలిన విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో బయట ప్రైవేట్ పీజీలను వెతుక్కోవాల్సి వస్తోందని చెప్పారు. ఇక ఈమధ్య ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో విద్యార్థులు ఉంటున్న ప్రైవేట్ పీజీ భవనం కూలిపోవడంతో ఈ హాస్టల్ వసతుల గురించి మరోసారి చర్చలోకి వచ్చింది. ఇప్పటికే ఈ సంఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు కూడా. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలో ప్రత్యేకంగా ఏపీ విద్యార్థుల కోసం హాస్టల్ భవనాలను ఏర్పాటు చేయాలని విజయసాయి రెడ్డి కోరారు. అబ్బాయిలు, అమ్మాయిలకు ప్రత్యేక వసతి కల్పించడంతో పాటు భద్రత కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు అందుబాటులో ఉండేలా సబ్సిడీ ధరలతో వసతి కల్పిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. నిజంగా విజయసాయి రెడ్డి లేవనెత్తిన విధంగా ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకుంటే మాత్రం ఢిల్లీలో చదువుకునే ఏపీ విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుందని చెప్పాలి. #DelhiUniversity has nearly 7 lakh students, but only 8,000 hostel rooms. Even Sri Venkateswara College, managed by TTD, has 4,600 students but hostel capacity of just 150. Thousands of students from #AndhraPradesh come to #Delhi for education every year. With hostel in short… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 8, 2026 Join WhatsApp Channel Tags

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.