బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ మొదలైందో లేదో అప్పుడే రచ్చ షురూ అయింది! ఇంటి సభ్యుల మధ్య మొదలైన మాటల యుద్ధం, రోహిత్ మాస్ వార్నింగ్, నరేష్ కన్ఫ్యూజన్.. ఈ ఎపిసోడ్ లో ఊహించని మలుపులు చోటుచేసుకున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ!
బిగ్ బాస్ 10లో మొదటి రోజే గొడవలు, ఇంటి సభ్యుల మధ్య మాటల యుద్ధం.
రోహిత్ ఫైర్: 'మీరు ఎంగిలి చేస్తే మేము కడగాలా' అంటూ మాస్ వార్నింగ్.
జబర్దస్త్ నరేష్ కు పవర్ కీ కన్ఫ్యూజన్, తన పవర్ ఏంటో తెలియక తంటాలు.
లీడర్ల ఎంపికలో త్రిగుణ్ త్యాగం, షాలినితో రోహిత్ వాదోపవాదాలు వైరల్.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆదివారం సెప్టెంబర్ 6న గ్రాండ్ గా లాంచ్ అయింది. 16 మంది సభ్యులు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కాగా సోమవారం రోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఇంట్లో తొలి రోజే గొడవలు మొదలయ్యాయి. హౌస్ లో ఉన్న వాళ్లంతా ఇంకా హౌస్ మేట్స్ కాలేదు అని బిగ్ బాస్ మెలిక పెట్టారు. హౌస్ మేట్స్ కావాలి అంటే మహా పరీక్షలో నెగ్గాలి అని బిగ్ బాస్ తెలిపారు.
హౌస్ లో 8 మంది పవర్ కీస్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆ 8 మంది మరో ఇద్దరికి పవర్ కీస్ ఇవ్వాలి. దాని కోసం ఇద్దరిని ఎంపిక చేయమని బిగ్ బాస్ కోరారు. దీనితో ఇంటి సభ్యులు వాదోపవాదాలు చేసుకుంటూ.. చివరికి టెంపర్ వంశీ, కృష్ణుడు లకు కీస్ ఇవ్వాలని నిర్ణయించారు.
మధ్యలో నరేష్, రాంప్రసాద్ కలసి ఇతర సభ్యులపై ఫన్నీ కామెంట్స్ చేస్తూ బాగా నవ్వించారు. ముఖ్యంగా దేబ్జానీ ముద్దు గా చెబుతున్న మాటలు, రాంప్రసాద్ వేస్తున్న సెటైర్లు బాగా వైరల్ అయ్యేలా ఉన్నాయి.
దేబ్జానీ అయితే బిగ్ బాస్ మీరు శాంటాక్లాజ్ లాంటి ఫన్నీ వ్యక్తి. కానీ స్కూల్ ప్రిన్సిపాల్ లాగా బిల్డప్ ఇస్తున్నారు అంటూ సెటైర్లు వేసింది. నేను శాంటాక్లాజా, ప్రిన్సిపాల్ నా అనేది ముందు ముందు నీకే తెలుస్తుంది అని బిగ్ బాస్ సుతి మెత్తని వార్నింగ్ ఇచ్చారు.
చివరలో కాస్త హంగామాతో ఎపిసోడ్ 2 ముగిసింది. ఇంటి సభ్యులు 2 గ్రూపులుగా విడిపోయి పరీక్షలో పాల్గొనాలి. కాబట్టి ఇద్దరు లీడర్లు కావాలి. ఇద్దరు లీడర్లని ఇతర సభ్యులు ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఎన్నుకున్నారు. ఈ ఓటింగ్ ప్రక్రియలో రోహిత్, రాంప్రసాద్ లీడర్లుగా ఎంపిక అయ్యారు. త్రిగుణ్, రాంప్రసాద్ కి సమానమైన ఓట్లు వచ్చాయి. కానీ త్రిగుణ్ రామ్ ప్రసాద్ కోసం త్యాగం చేసి పక్కకి తప్పుకున్నాడు. దానికి త్రిగుణ్ చెప్పిన కారణం పెద్ద గొడవకు కారణం అయింది. రోహిత్ కి అంతా అగ్ని పరీక్షలోని వాళ్లే ఓట్లు వేశారు. కాబట్టి నేను రాంప్రసాద్ కి ఓటు వేస్తున్నా అని తెలిపారు. మేము అగ్ని పరీక్షలో వాళ్ళమే అయినప్పటికీ..రోహిత్ ట్యాలెంట్ చూసి ఓటు వేశామని.. గ్రూపులు కట్టడానికి కాదు అంటూ షాలిని ముందుకు వచ్చింది. మాటా మాటా పెరిగి గొడవ పెద్దది అయింది. రోహిత్ కనీసం హౌస్ లో కప్పులు కూడా కడగలేదు అని త్రిగుణ్ ఆరోపించారు. ఏంటి మీరు ఎంగిలి చేస్తే మేము కడగాలా అంటూ రోహిత్ ఫైర్ అయ్యాడు. అంతకు ముందు తమ పవర్ కీస్ ని ఓపెన్ చేసే సమయంలో జబర్దస్త్ నరేష్ కి చుక్కలు కనిపించాయి. తన పవర్ ఏంటో తనకే అర్థం కాక నరేష్ జుట్టు పీక్కున్నాడు. అందులో రాసి ఉన్నది అర్థం కాలేదు అని, అర్థం అయ్యేలా చెప్పాలి అని నరేష్ బిగ్ బాస్ ని అడుక్కోవడం నవ్వులు పూయించింది.
బిగ్ బాస్ ఇంట్లో మొదటి రోజే ఇంతటి ఉత్కంఠత రేకెత్తించింది. రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు చోటుచేసుకుంటాయో చూడాలి. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి!
(0)Comments