Bs Ramulu - హేతువాద శిఖరం త్రిపురనేని గోపీచంద్

Bs Ramulu - హేతువాద శిఖరం త్రిపురనేని గోపీచంద్
View on original source
Category: Politics
Share
Archive
Like
తెలుగు సాహిత్యంలో ఆలోచనాత్మక కథనానికి, హేతువాద దృక్పథానికి సరికొత్త బాటలు వేసిన మహోన్నత రచయిత, సామాజిక తత్వవేత్త త్రిపురనేని – ప్రసిద్ధ హేతువాది, కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి వారసుడిగా జన్మించినప్పటికీ, తన స్వయంకృషితో, విశిష్టమైన రచనా శైలితో తెలుగు నవలా సాహిత్యంలో తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకున్నారు. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (నవల విభాగానికి) అందుకున్న గోపీచంద్ గారికే దర్శింది. గోపీచంద్ గారు 1910 సెప్టెంబర్ 6న కృష్ణా జిల్లాలోని అంగలూరు గ్రామంలో జన్మించారు. చిన్నతనం నుంచే ఆయనకు సమాజంలోని అంధ విశ్వాసాలను ప్రశ్నించే తత్వం అలవడింది. ఉన్నత చదువుల కోసం ఆయన కొంతకాలం శాంతినికేతన్ వెళ్లారు. అక్కడ ఉన్న వాతావరణం, ప్రకృతితో ముడిపడిన జీవనశైలి, విశ్వమానవ కళా దృక్పథం ఆయన సృజనాత్మక ఆలోచనలను ఎంతగా నో ప్రభావితం చేశాయి. ఆ తర్వాత ఆయన న్యాయశాస్త్రం అభ్యసించి లాయర్ గా కూడా పట్టా పొందారు. గోపీచంద్ తన తండ్రి త్రిపురనేని రామస్వామి నుండి 'ఎందుకు?' అని ప్రశ్నించే గొప్ప ఆయుధాన్ని హేతుబద్ధమైన ఆలోచనను వార సర్వంగా పొందారు. అయినప్పటికీ, కాలక్రమేణా తండ్రీకొడుకుల మధ్య తీవ్రమైన తాత్విక విభేదాలు తలెత్తాయి. తండ్రి సామాజిక ఆచారాలను నిర్మూలించే పోరాటంలో నిమగ్నమైతే, గోపీచంద్ మనిషి లోపల జరిగే అంతర్మధనానికి, మానసిక బలహీనతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. తండ్రి చూపిన కఠిన హేతువాద శైలితో విభేదించి, మనిషి పట్ల అపారమైన కరులతో కూడిన మానవతావాదాన్ని ఆయన . గోపీచంద్ గారి తాత్విక ప్రయాణాన్ని శాసించిన వ్యక్తి యం.యన్. రాయ్. ఆయన ప్రతిపాదించిన రాడికల్ హ్యూమనిజం సిద్ధాంతాన్ని గోపీచంద్ నమ్మారు. రాయ్ నడిపిన ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ, ఆయన రాసిన ఎన్నో రాజకీయ, సామాజిక వ్యాసాలను తెలుగులోకి అనువదించారు. తెలుగునాట హేతువాద మానవవాద ఉద్యమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లిన ప్రముఖ తాత్వికుడు రావిపూడి వెంకటాద్రితో గోపీచంద్ ్కు అద్భుతమైన బంధం ఉండేది. ఎం.ఎన్. రాయ్ ఆలోచనలను తెలుగు సమాజంలో ప్రచారం చేసే క్రమంలో వీరిద్దరూ కలిసి ఎన్నో వేదికలను పంచుకున్నారు. సాహిత్య చర్చలు జరిపారు. తెలుగు చలనచిత్ర స్వర్ణయుగంలో గోపీచంద్ కథా రచయితగా, మాటల నేర్పరిగా, దర్శకుడిగా విశిష్టమైన సేవలు అందించారు. సినిమాల్లోనూ తన సామాజిక దృక్పథాన్ని, విలువలను వదల్లేదు. తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన రైతుబిడ్డ (1918) సినిమాకు ఆయన మాటలు రాశారు. అలాగే ధర్మదేవత (1952), చదువుకున్న అమ్మాయిలు (1962) చిత్రాలకు డైలాగ్స్ అందించారు. మహిళల జీవితాల నేపథ్యంలో సాగే లక్ష్మమ్మ (1950). పేరంటాలు (1953), ప్రియురాలు (1952) (ఈ సినిమాకు కథ, మాటలు, దర్శకత్వం ఆయనే) వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి, సినిమా మాధ్య మం ద్వారా సామాజిక సందేశాలను ఇచ్చారు. ప్రపంచ ప్రసిద్ధ తాత్వికుల జీవితా లను, సిద్ధాంతాలను వారవారమూ పత్రికలలో ధారావాహికగా రాశారు. ఆ వ్యాసాలన్నింటినీ క్రోడీకరించి తత్వ వేత్తలు పేరిట ఒక సమగ్ర ప్రామాణిక గ్రంథంగా వెలువరించారు. సోక్రటీస్ నుండి ఎం.ఎన్. రాయ్ వరకు అందరి తత్వాలను సామాన్యుడి తెలుగు భాషలోకి మార్చిన ఘనత ఈ సీరియల్ వ్యాసాల తెలుగు సాహితీ ప్రపంచంలో గోపీచంద్ శైలి అత్యంత విలక్షణమైనది. అసమర్థుని వయాత్ర తెలుగు సాహిత్యంలోనే మొట్టమొదటి మనోవైజ్ఞానిక నవల. సీతారామారావు అనే పాత్ర ద్వారా సమాజంలోని కపటత్వాన్ని, మధ్య తరగతి మనుషుల ఆపాండారాలు, అసమర్థతలను గోపీచంద్ ఈ నవలలో నగ్నంగా చూపించారు. పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా నవలకు గాను ఆయనడు మరణానంతర గౌరవంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (1963) లభించింది. సంప్రదాయానికి, ఆధునికతకు మధ్య జరిగే ఘర్షణను ఇందులో చిత్రించారు. సమాజంలో పెరుగుతున్న అసహనానికి వ్యతిరేకంగా ఆయన ప్రవరించిన మానవతావాదాన్ని, తత్వవేత్తలు వంటి గ్రంథాల ద్వారా అందించిన వైచారిక చైతన్యాన్ని గుండెల్లో నింపుకోవడమే ఆ మహారచయితకు మనం అర్పించే నిజమైన నివాళి! బీఎస్ రాములు సామాజిక తత్వవేత్త, 8331960987 నేడు త్రిపురనేని గోపీచంద్ జయంతి

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.