Vijay Deverakonda
ఆనంద్ దేవరకొండ నటించిన ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ ట్రైలర్ లాంచ్ వేదికపై విజయ్ దేవరకొండ స్పీచ్ అదరగొట్టారు. తన తమ్ముడు ఆనంద్‌కు అండగా నిలిచిన విజయ్, ఆనంద్ సినిమా ఎంపికలను, సొంత మార్గాన్ని సృష్టించుకోవడాన్ని ఎంతగానో ప్రశంసించారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, ఆనంద్ ఎప్పుడూ తనను అనుసరించేవాడని, అయితే ఇప్పుడు అతను తన స్వంత గుర్తింపును ఏర్పరచుకున్నాడని అన్నారు విజయ్. ఎపిక్ ఆనంద్ ఫిల్మోగ్రఫీలో మరో అద్భుతమైన చిత్రంగా నిలుస్తుందని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. 90స్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు ఆదిత్య హాసన్‌ను విజయ్ ప్రత్యేకంగా కొనియాడారు. 90స్ సిరీస్‌ను చూడటానికి తాను యాప్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్నానని, ఆదిత్య సినిమా చేస్తే తప్పకుండా చూడాలని అప్పుడే అనుకున్నానని తెలిపారు. అలాగే, ఎపిక్ చిత్రంలో నటించిన వైష్ణవి చైతన్యను ఒక టాలెంటెడ్ యాక్ట్రస్ అని అన్నారు విజయ్. అలాంటి సినిమాలు ఆడవు అన్నారు.. కానీ నా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది: దుల్కర్ సల్మాన్
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ దూసుకుపోతుందని విజయ్ అన్నారు. ఆపరేషన్ టీఎఫ్‌ఐగా తాను పిలిచే ఈ దశలో దర్శకులు అద్భుతమైన కథలను రాస్తున్నారని, నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. తాను చూసిన రాబోయే నాలుగు చిత్రాల గ్లింప్స్ బట్టి, ఈ ఏడాది '100 శాతం స్ట్రైక్ రేట్' సాధిస్తుందని విజయ్ ధీమాగా చెప్పారు. సెప్టెంబర్ 11న ఆనంద్ ఎపిక్, అక్టోబర్‌లో తన సినిమా, నవంబర్‌లో రష్మిక సినిమా, డిసెంబర్‌లో బాలయ్య గారి దాదా, ప్రభాస్ ఫౌజీ వంటి అనేక చిత్రాలు వరుసగా వస్తున్నాయని అన్నారు విజయ్
నటుడిగా తన కెరీర్‌కు మించి, ప్రజలకు స్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడమే తన అతిపెద్ద లక్ష్యమని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. 'నేను చేయగలిగితే, మీరు ఎందుకు చేయలేరు?' అనే సందేశాన్ని అర్జున్ రెడ్డి సమయంలోనే తాను ఇచ్చానని, ఈరోజు కూడా అదే ఉద్దేశ్యంతో పని చేస్తున్నానని అన్నారు. తన ద్వారా చాలా మంది స్ఫూర్తి పొందుతారని ఆశిస్తున్నానని తెలిపారు. 90స్ టీమ్ అయిన శివాజీ, వాసుకి, మౌళి, రోషన్ లను కూడా గుర్తుచేసుకుని, వారు అందించిన మంచి జ్ఞాపకాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ సెప్టెంబర్ 11న భారీ విజయం సాధించాలని ఆశిస్తున్నా అని విజయ్ అన్నారు.
ఇవి కూడా చదవండి
వాళ్లకు నాకు ఐఫోన్, నోకియా ఫోన్‌కు ఉన్నంత తేడా ఉంది ఒకొక్కరికి అంత రెమ్యునరేషనా..! ఆ హీరోయిన్‌ను చూస్తే ఎవ్వరికైనా గౌరవం ఇవ్వాలనిపిస్తుంది.. కనీసం గూగుల్ కూడా నీ పేరు రాదని అవమానించారు ఎన్టీఆర్, పవన్, మహేష్‌లతో ఆడిపాడింది.. కట్ చేస్తే ఇప్పుడు కనిపించకుండాపోయింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
(0)Comments