Kothagudem Airport : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి సంబంధించి స్థల ఎంపిక ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. (Kothagudem Airport) విమానాశ్రయ స్థలాలను పరిశీలించేందుకు Airports Authority of India (AAI)కు చెందిన సాంకేతిక నిపుణుల బృందం సెప్టెంబర్ 7, 8 తేదీల్లో జిల్లాలో పర్యటిస్తోంది. ప్రతిపాదిత ప్రాంతాల భౌగోళిక, సాంకేతిక, వాతావరణ, భూసంబంధిత అంశాలను బృందం పరిశీలిస్తోంది.
Read Also : ఈపీఎఫ్ విత్‌డ్రా.. కొత్త రూల్స్.. ఎవరెంత తీసుకోవచ్చంటే..?
క్షేత్రస్థాయి పరిశీలనను తుది స్థల ఎంపిక :
ప్రస్తుతం జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనను తుది స్థల ఎంపికగా భావించకూడదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పలు ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో ప్రాథమిక పరిశీలన అనంతరం, పూర్తి స్థాయి సాంకేతిక అధ్యయనం, అందుబాటులో ఉన్న డేటా విశ్లేషణ, విమాన కార్యకలాపాలకు సంబంధించిన సిమ్యులేషన్ తదితర ప్రక్రియలను చేపట్టాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియకు సుమారు 6 నుంచి 8 వారాల సమయం పట్టే అవకాశం ఉంది.
ఈ అధ్యయనాల ఆధారంగా సమగ్ర టెక్నో-ఫీజిబిలిటీ నివేదిక రూపొందించి కేంద్ర పౌర విమానయాన శాఖకు తదుపరి చర్యల కోసం సమర్పించనున్నారు. గతంలో ప్రతిపాదించిన పాల్వంచ ప్రాంతం విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా లేదని కేంద్రం పేర్కొంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రాంతాలను గుర్తించి కొత్త ప్రతిపాదనలను ముందుకు తీసుకొచ్చింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అధ్యయనంలో సీతంపేట, సుజాతనగర్ ప్రాంతాలను అనుకూలంగా గుర్తించినప్పటికీ, తుది నిర్ణయం కేంద్ర సాంకేతిక పరిశీలన, సమగ్ర సాధ్యాసాధ్యాల నివేదికపైనే ఆధారపడి ఉంటుంది.
విమానాశ్రయం ఏర్పాటైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు భద్రాచలం ప్రాంతానికి మెరుగైన విమాన కనెక్టివిటీ లభించే అవకాశం ఉంది. పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ధి, వాణిజ్యం, పెట్టుబడులకు కూడా ఇది ఊతమిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రస్తుతం 'స్థలం ఖరారైంది' అని చెప్పడానికి ఇంకా సమయం ఉంది. సాంకేతిక బృందం అధ్యయనం పూర్తై, తుది నివేదిక వచ్చిన తర్వాతే విమానాశ్రయానికి అనువైన ప్రాంతంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
రచయిత గురించి
Ramesh
Previous
Local Elections : స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక ఆదేశాలుగమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
మరిన్ని వార్తలు YouTuber Nandana: పోలీసుల విచారణలో యూట్యూబర్ నందన..నాకేం తెలియదు, అంతా భర్తే చూసుకున్నాడంటూ వాదన
School Holidays: తెలుగు రాష్ట్రాల్లో వరుసగా మూడు రోజుల హాలిడేస్
Ganesh Festival: గణేష్ ఉత్సవాల్లో డీజేలకు నో.. పోలీసుల కీలక నిర్ణయం
Naveen Kumar Reddy: మండలి నుంచి MLCలు మధు, నవీన్ రెడ్డి సస్పెండ్
Bhatti Vikramarka: స్పీకర్‌పై బీఆర్‌ఎస్ సభ్యుల వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మచ్చ: భట్టి
Thatha Madhu: తాతా మధు, నవీన్ రెడ్డిలకు ఊరట.. రిమాండ్ తిరస్కరించిన కోర్టు
ప్రకటన అత్యధికంగా చదివారు
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, అర్హులైన పేదలకు కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు...
భారతీయ బులియన్ మార్కెట్లో మంగళవారం ఉదయం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్...
హైదరాబాద్ మహానగరం రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. భాగ్యనగరం కొన్ని చోట్ల ఔటర్ రింగ్ దాటి పోయింది....
మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'కాకా'....
కాలం మారుతున్న కొద్దీ మనుషుల మధ్య బంధాలు, భావోద్వేగాలు కూడా మారిపోతున్నాయా అనిపించే ఘటన ఇది....
కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం...
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ వర్కింగ్...
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం...
భారత క్రికెట్ జట్టు తొలిసారిగా జపాన్‌తో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో తలపడేందుకు సిద్ధమవుతోంది. రెండు దేశాల...
అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా ప్రాంతమంతటా బూడిద వ్యాపించి, అనేక విమానాశ్రయాలు రెండు రోజుల పాటు మూసివేయబడటంతో,...
ప్రకటన తాజా వార్తలు
మీకు నచ్చవచ్చు
(0)Comments