వనపర్తి (తెలుగు ప్రభ): ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ సేవలను అనధికారికంగా నిర్వహిస్తున్న ఇంటర్నెట్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని వనపర్తి జిల్లా ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ (EDM) అదనపు కలెక్టర్ (రెవెన్యూ) హెచ్చరించారు. జిల్లాలోని పలు ఇంటర్నెట్ సెంటర్లను తనిఖీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ కేటాయించిన ప్రదేశాల్లో కాకుండా ఇతర ఇంటర్నెట్ సెంటర్లలో అనధికారికంగా MeeSeva సేవలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.
తనిఖీల్లో భాగంగా రాజాపేట గ్రామం, వనపర్తి మండలం, ఆత్మకూరు మండలం, వనపర్తి జిల్లా కేంద్రంలోని OSS కేంద్రాలను పరిశీలించినట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన MeeSeva/OSS కేంద్రాలను వెంటనే అనుమతి లేకుండా ఇతర ప్రదేశాలకు తరలించడం, అనధికార వ్యక్తుల ద్వారా నిర్వహించడం వంటి అంశాలను గుర్తించినట్లు చెప్పారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన మీసేవ ఓఎస్ఎస్ కేంద్రాలను ముందస్తు అనుమతి లేకుండా ఇతర ప్రాంతాలకు తరలించడంపై, అనధికార వ్యక్తులతో సేవలు నిర్వహించడంపై అధికారులు స్పష్టం చేశారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు గుర్తించిన సంబంధిత కేంద్రాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశించినట్లు వెల్లడించారు.
అనధికార కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో మీసేవ కేంద్రాల నిర్వహణను మరింత కట్టుదిట్టంగా పర్యవేక్షించేందుకు తహసీల్దార్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ తెలిపారు. ప్రభుత్వానికి జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే సంబంధిత నిర్వాహకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రజలు ప్రభుత్వ సేవల కోసం అధికారికంగా కేటాయించిన కేంద్రాలను మాత్రమే వినియోగించాలని, అనధికారిక ఇంటర్నెట్ కేంద్రాల ద్వారా సేవలు పొందే విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అధికారిక సేవల పేరుతో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసినా, అనధికారికంగా సేవలు అందించినా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
(0)Comments