బొత్స ముందు అగ్ని పరీక్ష

బొత్స ముందు అగ్ని పరీక్ష
View on original source
Category: Politics
Share
Archive
Like
తన నీడలో ఎదిగి జిల్లా రాజకీయాల్లో ప్రముఖ నేతగా ఎదిగిన సొంత మేనల్లుడు చిన్న శ్రీను పార్టీని వీడడం మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు వ్యక్తిగతంగా భారీ నష్టం అని అంటున్నారు. విజయనగరం జిల్లా అంటేనే బొత్స కుటుంబ రాజకీయం అన్నది తెలిసిందే. వైసీపీ అధినాయకత్వం కూడా పూర్తిగా ఆ కుటుంబం మీదనే ఆధారపడి రాజకీయాలను చేస్తూ వస్తోంది. ఇక్కడే తెలుగుదేశం పార్టీకి, వైసీపీకి తేడా ఉంది. టీడీపీ ఏ ఒక్కరికో పెత్తనం ఇవ్వకుండా జాగ్రత్త పడుతుంటే.. వైసీపీ ప్రతీ చోటా కొందరు నేతలనే నమ్ముకుని పార్టీని మొత్తం వారి చేతుల్లో పెడుతోంది. దీని వల్ల ఆ కుటుంబాల్లో విభేదాలు వస్తే వైసీపీకి కూడా అంతిమంగా భారీ నష్టం చేకూరుతుంది. ఇక విజయనగరం జిల్లాలో చూసుకుంటే బొత్స సత్యనారాయణ తిరుగులేని నేతగా ఉన్నారు. ఆయన సీనియారిటీని గౌరవిస్తూనే వైసీపీ అధినాయకత్వం చిన్న శ్రీనుని కూడా బాగానే ప్రోత్సహించింది. అయితే ఇద్దరినీ కోఆర్డినేట్ చేయడంలో ఎక్కడో వైఫల్యం చెందింది అని అంటున్నారు. ఇది పూర్తిగా బొత్స కుటుంబ సమస్యగా వైసీపీ హైకమాండ్ భావించడం వల్లనే ఇప్పుడు చిన్న శ్రీను పార్టీని వీడిపోవాల్సి వచ్చింది అని అంటున్నారు. మరి వైసీపీ హైకమాండ్ నుంచి ఆయనకు సరైన భరోసా దక్కిందా లేదా అన్నది తెలియదు అంటున్నారు. ఇప్పుడు చూస్తే తన కుమార్తె అనూషను విజయనగరం జిల్లా పీఠం మీద కూర్చోబెట్టాలని బొత్స ఆశిస్తున్నారు. ఆయన మీదనే మొత్తం పార్టీ భారం కాబట్టి అధినాయకత్వం కూడా ఓకే చేసిన నేపథ్యం ఉంది. ఈ క్రమంలో చిన్న శ్రీను పార్టీని వీడిపోవడంతో పాటు తన కుమార్తె సిరిని కూడా అదే జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎక్కించాలని చూస్తున్నారు. ఆయనకు ఆ మేరకు చేరుతున్న పార్టీ నుంచి హామీ వచ్చినట్లుగా చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే విజయనగరం జిల్లా పరిషత్ పీఠం యుద్ధం మామూలుగా ఉండదని అంటున్నారు. వారసులు పేరుకు పోటీలో ఉన్నా.. మామ, మేనల్లుడి మధ్యనే స్థానిక సమరం సాగుతుంది. ఒక విధంగా బొత్సకు ఇది అగ్ని పరీక్ష కానుంది. అలాగే ఆయన కుమార్తె రాజకీయ అరంగేట్రం చేస్తూ తొలి ఎన్నికల్లోనే తప్పకుండా విజయం సాధించాల్సి ఉంది. ఇవన్నీ చూస్తుంటే విజయనగరం జిల్లా రాజకీయాల్లో రేపటి నుంచి సంచలన పరిణామాలు అనేకం చోటు చేసుకుంటాయని అంటున్నారు. #ट्रेंडिंग हैशटैग: bosta satyanarayanaChinna Srinu

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.