ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీకి బిగ్‌షాక్‌ - టీడీపీలో చేరిన బొత్స మేనల్లుడు

ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీకి బిగ్‌షాక్‌ - టీడీపీలో చేరిన బొత్స మేనల్లుడు
View on original source
Category: Politics
Share
Archive
Like
Chinna Srinu Join TDP : స్థానిక ఎన్నికల ముందు ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. మాజీ మంత్రి, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్​మోహన్ రెడ్డికి పంపారు. విజయనగరం జడ్పీ ఛైర్మన్, భీమిలి పార్టీ ఇంఛార్జ్​గానూ చిన్న శ్రీను పనిచేస్తున్నారు. వైఎస్సార్సీపీ సభ్యత్వంతో పాటు విజయనగరం జిల్లా అధ్యక్ష పదవి, భీమిలి ఇంఛార్జ్​ పదవికీ స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. అనంతరం చిన్న శ్రీను టీడీపీ చేరారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అనుచరులతో కలిసి పసుపు కండువా కప్పుకొన్నారు. శ్రీను కుమార్తె సిరి సహస్ర, ఆమె అనుచరులు కూడా తెలుగుదేశం పార్టీ చేరారు. పార్టీలో చిన్న శ్రీను చేరిక కార్యక్రమానికి మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్‌, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు కళా వెంకట్రావు, కొండ్రు మురళి, కోళ్ల లలితకుమారి తదితరులు హాజరయ్యారు. Majji Srinivasa Rao Quits YSRCP : అనంతరం చిన్న శ్రీను మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని ఆ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు టీడీపీలో చేరానని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ నాయకత్వం బలోపేతం కావాలని ఆకాక్షించారు. తనను టీడీపీలోకి ఆహ్వానించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చేవారు ఇంకా చాలామంది ఉన్నారని చిన్న శ్రీను వ్యాఖ్యానించారు. చిన్న శ్రీను రాజీనామాకు వ్యక్తిగత కారణాలే కారణమని ఆయన పైకి చెప్తున్నప్పటికీ, అసలు కారణం పార్టీ అంతర్గత పోరు, కుటుంబ విభేదాలేనని జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు, చిన్న శ్రీనుకు మధ్య తీవ్ర స్థాయిలో 'కోల్డ్ వార్ ' నడుస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో వైఎస్సార్సీపీ బలోపేతానికి, కేడర్‌ను నడిపించడంలో చిన్న శ్రీను కీలక పాత్ర పోషించారు. అయితే గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాల్లో చిన్న శ్రీను ప్రాధాన్యతను తగ్గించేందుకు బొత్స వర్గం ప్రయత్నాలు చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా భీమిలి నియోజకవర్గ బాధ్యతలతో పాటు జిల్లా రాజకీయాల్లో చిన్న శ్రీను స్వతంత్రంగా వ్యవహరించడం బొత్సకు నచ్చలేదని, ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తీవ్ర ఆధిపత్య పోరు నెలకొందని ప్రచారం సాగుతోంది. ప్రాధాన్యం తగ్గించే కుట్రలు సహించలేకే చిన్న శ్రీను వైఎస్సార్సీపీని వీడారని ఆయన అనుచర వర్గం స్పష్టం చేస్తోంది. చిన్న శ్రీను రాజీనామా ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ శ్రేణుల్లో తీవ్ర కలకలం రేపింది. అభివృద్ధితో ఓటు బ్యాంక్‌ను పెంచుకుందాం : సీఎం చంద్రబాబు తెలుగుజాతి నెంబర్‌వన్‌ కావాలంటే గురువుల చేతుల్లోనే ఉంది: సీఎం చంద్రబాబు

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.