జయప్రకా్‌షరెడ్డి తల్లిదండ్రులు నివసించిన గృహం
నేడు సినీ నటుడు జయప్రకా్‌షరెడ్డి వర్ధంతి
శిరివెళ్ల, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): నాటకరంగంపై ఉన్న మక్కువతో వెండి తెరకు పరిచయమై ప్రతినాయకుడిగా, కమేడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టి్‌స్టగా తనదైన శైలిలో రాణించి అందరి మన్ననలు పొందిన నటుడు జయప్రకా్‌షరెడ్డికి(జేపీ) నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం వీరారెడ్డిపల్లె గ్రామంతో విడదీయలేని అనుబంధం ఉంది. గుంటూరు జిల్లా చుండూరుకు చెందిన సాంబిరెడ్డి, శేషమ్మ దంపతుల కుమారుడు జయప్రకా్‌షరెడ్డి. తండ్రి సాంబిరెడ్డి రాయలసీమ ప్రాంతంలో ఎస్‌ఐగా పని చేస్తున్న సమయంలో ఆయన కుటుంబం 1961లోవీరారెడ్డిపల్లె గ్రామానికి వచ్చి కొంతకాలం నివసించింది. గ్రామంలో ఏ కార్యక్రమాలు జరిగినా హాజరై అందరితో కలిసిపోయే జయప్రకా్‌షరెడ్డి గుంటూరులోని ఆయన నివాసంలో 2020, సెప్టెంబరు 8న మృతి చెందారు.. నటుడు జయప్రకా్‌షరెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా వీరారెడ్డిపల్లె గ్రామస్థులు ఆయనను గుర్తు చేసుకున్నారు.
రాయలసీమ మాండలికంతో గుర్తింపు..
తాడిపత్రి వెంకటరెడ్డి అలియాస్ జయప్రకా్‌షరెడ్డికి రాయలసీమ మాండలికంతోనే ప్రత్యేక గుర్తింపు లభించింది. హాస్యాన్ని జోడిస్తూ.. రాయలసీమ యాసను ప్రయోగించిన తీరు ఆయనను రంగస్థలంలో చిరస్థాయిగా నిలిపేలా చేశాయి. 1988లో విడుదలైన బ్రహ్మపుత్రుడు చిత్రంతో తెలుగు సినీ రంగానికి పరిచయమైనప్పటికీ 1997లో వచ్చిన ప్రేమించుకుందాం రా, 1999లో విడుదలైన సమరసింహారెడ్డి చిత్రాల్లో విలన్ పాత్రలో రాయలసీమ మాండలికంలో ఆయన చెప్పిన డైలాగులు, సంభాషణలు సినిమా రంగంలో అవకాశాలు తెచ్చిపెట్టాయి. నటుడు జయప్రకా్‌షరెడ్డి.. హీరో మహే్‌షబాబుతో చివరగా 2020లో విడుదలైన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించారు. విలక్షణ నటుడైన జయప్రకా్‌షరెడ్డి కమేడియన్ ఆర్టిస్టుగా, విలన్‌గా వందకు పైగా చిత్రాల్లో నటించి అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
Updated Date - Sep 08 , 2026 | 12:36 AM
Tags
(0)Comments