ఆదిత్యుని హుండీల ఆదాయం
అరసవల్లి, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): అరసవల్లిలోని ఆదిత్యాలయంలో సోమవారం హుండీల ఆదాయం లెక్కింపు నిర్వహించారు. 18 హుండీల ద్వారా 63 రోజులకుగాను రూ.64,63,898 ఆదాయం లభించిందని ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్ తెలిపారు. నోట్లు రూపంలో రూ.60,70,701, నాణేల ద్వారా రూ.3,93,197 ఆదాయం లభించిందన్నారు. అలాగే బంగారం 23గ్రాముల 500మి.గ్రాములు, వెండి 1కిలో 80 గ్రాములు, సౌదీ రియాల్స్-200, అరేబియన్ రియాల్స్-30, కెనడా డాలర్స్-20, ఇండోనేషియా రుపియా 2000, యుఎస్ డాలర్స్-32, ఓమన్ బైసాలు-100, టాంజానియా షిల్లింగ్స్-10,000 లభించాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా దేవదాయశాఖ అధికారి ప్రసాదరావు పట్నాయక్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, ట్రస్టు బోర్డు సభ్యులు కొండలరావు, పాపారావు, కన్నారావు, గాంధీ, ఈవోలు గురునాథరావు, మాధవి, శ్యామలరావు, ఆలయ సూపరింటెండెంట్ వేంకటేశ్వరరావు, సీనియర్ అసిస్టెంట్ శోభనాధ్రాచార్యులు, బాల భాస్కరసాయి, అర్చకులు పాల్గొన్నారు.
Updated Date - Sep 08 , 2026 | 12:21 AM
(0)Comments