కలెక్టర్‌తో ఉపాధ్యాయులు
పార్వతీపురం, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఫిన్లాండ్ విద్యా విధానాలను ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. ఫిన్లాండ్ విద్యా వ్యవస్థపై అధ్యయనం చేసిన జియ్యమ్మవలస మండలం పెద్దబుడ్డిడి ప్రాథమిక పాఠశాల ప్రధానో పాధ్యాయుడు ఎర్ర శంకరరావు, పాలకొండ జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన సంస్కృత ఉపాధ్యాయుడు బౌరోతు శంకరరావును ఆయన అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిన్లాండ్‌లో అనుభవాత్మక అభ్యసనం జీవన నైపుణ్యాలు, తక్కువ బోధన-ఎక్కువ పరిశీలన, ప్రకృతి ఆధారిత విద్య వంటి విధానాలు విద్యార్థుల్లో స్వయం ఆలోచన, సృజనాత్మకతను పెంపొందిస్తున్నాయన్నారు. పర్యటనలో నేర్చుకున్న అంశాలు, కరికులమ్ సంస్కరణలు, ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్, సమయపాలన, పరిశుభ్రతపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
Updated Date - Sep 08 , 2026 | 12:24 AM
Tags
(0)Comments